నవోదయ విద్యాలయంలో గణిత దినోత్సవం
కాగజ్‌నగర్‌టౌన్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో సోమవారం గణిత దినోత్స వం ఘనంగా నిర్వహించారు. సింగరేణి బె ల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రామానుజం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. జీఎం మాట్లాడుతూ అతితక్కువ జీవిత కాలంలో గణిత శాస్త్ర అభివృద్ధికి రామానుజం చేసిన సేవలను కొనియాడారు. గణిత శాస్త్రానికి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. అనంతరం గణిత ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, ప్రధానోపాధ్యాయుడు కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


