రాజీ మార్గమే ఉత్తమం
ఆసిఫాబాద్‌అర్బన్: వివిధ కేసుల్లో దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్న వారు రాజీపడి పరిష్కరించుకోవడమే ఉత్తమమని సెషన్స్ కోర్టు సివిల్ జడ్జి కె.యువరాజ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఆదివా రం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కేసులు రాజీ చేసుకున్నారని తెలిపా రు. నాలుగు బెంచ్‌ల పరిధిలో 11,022 కేసులను పరిష్కరించగా, రూ.55,61,865 జరి మానా చెల్లించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
రాజీమార్గంలో పరిష్కరించుకోవాలి
సిర్పూర్(టి): కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు సిర్పూర్(టి) మేజిస్ట్రేట్ అజయ్ ఉల్లం అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కోర్టు పరిధిలో గల సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, దహెగాం, కాగజ్‌నగర్, కాగజ్‌నగర్ రూరల్, ఈజ్‌గాం పోలీసుస్టేషన్‌ల పరిధిల్లోని 771 కేసులు లోక్‌అదాలత్‌లోకి రాగా 656 కేసులును పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, న్యాయవాదులు కిశోర్‌కుమార్, గంట కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


