లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, ఉపాధిహామీ పథకం కింద 200 రోజుల పనిదినాలు కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, పీఆర్‌సీ డబ్బులు ఇవ్వాలని, సింగరేణి ఆవిర్భావ వేడుకలు గతంలో మాదిరి జరపాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను అసంఘటిత, సంఘటిత కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, నాయకులు పిడుగు శంకర్, సుధాకర్, దత్తు, తిరుతి, నగేశ్, శ్రీనివాస్ లక్ష్మణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


