డీసీసీబీ ప్రత్యేకాధికారిగా ఆదిలాబాద్ కలెక్టర్ బాధ్య
కై లాస్‌నగర్: ఉ మ్మడి ఆదిలా బాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రత్యేకాధికారిగా, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార శాఖ అధికారి బి.మోహన్, స హకార బ్యాంకు సీఈవో సూర్య ప్రకాశ్, డీజీఎంలు వెంకటస్వామి, భీమేందర్ తదితరులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌రూరల్: మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వివాహితను వేధిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ కాలనీకి చెందిన రోహిత్ హుస్సేన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు షీటీం ఇన్‌చార్జి బి.సుశీల తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ గృహిణి గతంలో ఓ సొసైటీలో పనిచేస్తున్న క్రమంలో సహఉద్యోగి రోహిత్ హుస్సేన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆధారంగా చేసుకున్న నిందితుడు ఆమెను వేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో దాడులు చేస్తూ, డబ్బులు వసూలు చేసేవాడు. గతంలో నిందితుడు ఆమె ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి చేతులతో, కర్రతో దాడి చేశాడు. ఆమె ఆయన నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె చేతికి గాయమైంది. అంతేకాకుండా పలుమార్లు నగదు లాక్కొని పరారయ్యాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహిత ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు షీటీం ఇన్‌చార్జి తెలిపారు.


