భద్రత భేష్
జిల్లాలో మూడు విడతల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు నగదు, మద్యం, గంజాయి పట్టివేత సత్ఫలితాలనిచ్చిన పోలీస్ చర్యలు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు
కౌటాల: జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎ న్నికలు ప్రశాంతంగా ముగియడంలో జిల్లా పోలీ స్ యంత్రాంగం పనితీరును ఉన్నతాధికారుల ప్రశంసిస్తున్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ఎన్నికల సంఘం గుర్తించి అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసేది. పోలింగ్‌రోజు కొన్ని ప్రాంతాల్లో పలుసార్లు తోపులాటలు, దాడులు, పోటాపోటీ నినాదాలు చో టు చేసుకునేవి. ఎన్నికలకు ముందు బరిలో నిలిచి న అభ్యర్థులనూ మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడిన ఘటనలున్నాయి. కొన్ని మారుమూ ల ప్రాంతాల్లో ఎన్నికలంటే ఓ రణరంగం మాదిరి విర్రవీగుతూ చిందులేసే ప్రత్యర్థి వర్గాలుండేవి. అందుకుగాను గతంలో ఒక్కో పోలింగ్‌బూత్ వద్ద న లుగురైదుగురు పోలీస్ సిబ్బంది పహారా కాస్తే.. బయట ఆయా పార్టీల కార్యకర్తలను చెదరగొట్టేందుకు మరో నలుగురైదుగురు సిబ్బంది ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహించిన మూడు విడతల్లో నిర్వహించినా, పోలింగ్‌రోజుల్లో గొడవలు జరిగే అవకాశముందని పలువురు భావించారు. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుంఎస్పీ నితిక పంత్ నేతృత్వంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ప్రజల్లో వచ్చిన చైతన్యంతో జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదు.
వెయ్యి మందికి పైగా విధుల్లో..
జిల్లాలోని 335 పంచాయతీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. వెయ్యిమందికి పైగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, 15మంది ఎస్సైలు, 30కి మందికి పైగా ఏ ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 800 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, 200 మంది ఇతర శాఖల సిబ్బందితో పో లింగ్ రోజు ఆయా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ముందుగానే ఓటర్లను చైతన్య పరిచి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ రోజు ఎక్కడా.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎస్పీ నితిక పంత్ పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించారు. మరోవైపు ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతీ మండల కేంద్రం, పట్టణా లు, కొన్ని గ్రామాల్లోనూ పోలీసులు ముందస్తు కవాతు నిర్వహించి నిర్భయంగా ప్రజలు ఓటేయాలని అవగాహన కల్పించారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జి ల్లా పోలీస్‌శాఖ అక్రమ రవాణాపై నిఘా పెంచింది. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు మార్గాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసింది. దీంతో పోలీసులు పంచాయతీ ఎన్ని కల్లో పటిష్టమైన నిఘా పెట్టి రూ.6.49 లక్షల వి లువైన మద్యం, గంజాయి, నగదు, చీరలు స్వాధీ నం చేసుకున్నారు. తనిఖీల్లో రూ.22వేల నగదు, రూ.1,88,156 విలువైన 324 లీటర్ల మద్యం, రూ.1,94,190 విలువైన పీడీఎస్ బియ్యం, 90 చీ రలు పట్టుకుని సీజ్ చేశారు. 18గంజాయి మొక్కలు, 2.6కిలోల ఎండు గంజాయి (విలువ రూ.2.45లక్షలు) పట్టుకున్నారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన 959 మంది వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేశారు. వీరిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు భంగం క లించేలా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ ప్రత్యేక సెల్ అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ కోసం జిల్లా కేంద్రం నుంచి ఎక్కడికై నా సకాలంలో చేరేలా రూట్ మ్యాప్ ఏ ర్పాటు చేశారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పోలింగ్‌రో జు బందోబస్తు ఏర్పాటు విషయం తెలిసిందే.


