విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ నితిక పంత్ వాంకిడి ఠాణా తనిఖీ
వాంకిడి: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పో లీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితిక పంత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదైన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిష్టర్లు తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప లు సూచనలు చేశారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదక పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు, బాలబాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్ తదితరులున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ నితిక పంత్ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడపరాదని తెలిపారు. జిల్లా వ్యా ప్తంగా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని కోరారు.


