ప్రజల సహకారంతోనే..
జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి 800మంది పోలీస్ అధికారులు, సిబ్బంది, 200 మంది ఇతర శాఖల సిబ్బందితో విధులు నిర్వహించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు సహకరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశాం. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీసులతో కవాతు నిర్వహించి ప్రజలకు ఓటు విశిష్టత గురించి వివరించాం. జిల్లాలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించడంతో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
– నితిక పంత్, ఎస్పీ


