వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అవసరమైన అంశాలపై నివేదిక రూ పొందించి అందించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యుదీకరణ, తాగునీరు, ప్రహరీ, వంటశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా రు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నివేదికలో పొందుపరిచి అందించాలని ఆదేశించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈవోలు పాల్గొన్నారు.


