గుడుంబాను నిర్మూలించాలి
దహెగాం: గుడుంబాను పూర్తిగా నిర్మూలించాలని మండల కేంద్రానికి చెందిన మహిళలు, యువకులు శనివారం స్థానిక అంగడిబ జార్ నుంచి పోలీస్‌స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పల్లెల్లో గుడుంబా తయారు చేస్తూ మండల కేంద్రంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని తెలిపారు. దీంతో చాలామంది గుడుంబా తాగి అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి గుడుంబా తయారీ, విక్రయాలను పూర్తిగా అడ్డుకోవాలని కోరా రు. మండల కేంద్రాన్ని గుడుంబా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.


