సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: సైన్స్ కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. వార్షిక పరీక్షల్లో మరింత ఉన్నత ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయ ని పేర్కొన్నారు. సైన్స్‌కిట్లను డ్రీమ్ ట్రస్ట్ వారు అందించడం అభినందనీయమని తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీఈ వో దీపక్ తివారి తదితరులు పాల్గొన్నారు.


