ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి

Dec 21 2025 9:29 AM | Updated on Dec 21 2025 9:29 AM

ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి

ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలి

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ● వివిధ అంశాలపై సమీక్ష

ఆసిఫాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం అదనపు కలెక్టర్లు దీపక్‌ తివా రి, డేవిడ్‌, గృహనిర్మాణ శాఖ పీడీ ప్రకాశ్‌రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహనిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీ క్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులు వేగవంతం చేయాలని ఆదేశించారు. డీఆర్డీ వో దత్తారావు, డీఎల్పీవో ఒమర్‌ హుస్సేన్‌, హౌసింగ్‌ ఈఈ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి

జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్‌గా గుర్తించిన తిర్యాణిని మండలంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆకాంక్షిత బ్లాక్‌గా ఎంపికై న తిర్యాణిలో నీతిఆయోగ్‌ ద్వారా చేపడుతున్న మౌలిక వసతులు అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ భవనాలు, పాఠశా ల గదుల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుపై గిరి జన సంక్షేమ, విద్య, ఆరోగ్య, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో స మీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. తిర్యా ణి మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వ రగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని సూచించారు. ఆస్పత్రుల్లో శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు పనులు పూర్తి చేయాలని, అంబులెన్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, తిర్యాణి మండల సమాఖ్య భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌, డీఎంహెచ్‌వో సీతారాం, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, ఆర్డీ వో లోకేశ్వర్‌రావు, మైనార్టీ అధికారి నదీమ్‌తో కలిసి తహసీల్దార్లు, చర్చి ఫాదర్లు, సంబంధిత శాఖల అధికారులతో క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ కలిగిన చర్చిలకు విద్యుద్దీపాలు, అలంకరణ కోసం ప్రభుత్వం రూ.30 వే లు ఇస్తుందని తెలిపారు. కౌటాల, కాగజ్‌నగర్‌, రె బ్బెనలో నాలుగు చోట్ల వేడుకలు నిర్వహించేందుకు రూ.4లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

అంధులను ఆదుకోవడం అభినందనీయం

అంధులను ఆదుకోవడం అభినందనీయమని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్‌తో కలిసి దృష్టిలోపమున్న 26 మందికి స్మార్ట్‌ కళ్లజోళ్లు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ సంస్థ ఆ ధ్వర్యంలో బ్లైండ్‌ విజన్‌ ఫౌండేషన్‌ వారు విలువైన కళ్లజోళ్లు అందిస్తున్నారని తెలిపారు. ఒక్కో కళ్లజోడు ధర రూ.40 వేలు ఉంటుందని, ఏఐ సాంకేతికత ఆధారంగా బెంగళూరుకు చెందిన జాతీయ సంస్థ ఎస్‌హెచ్‌ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన ట్లు పేర్కొన్నారు. బ్లైండ్‌ విజన్‌ ఫౌండేషన్‌ ప్రతి ని ధులు చలపతి, సాగర్‌, ఆకాంక్షిత, జిల్లా బ్లాక్‌ సమన్వయకర్త బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement