నత్తనడకన ఈ–కేవైసీ
జిల్లాలో ఇప్పటివరకు 66శాతమే.. లబ్ధిదారుల నుంచి స్పందన అంతంతే జిల్లాలో 1,62,422 రేషన్‌కార్డులు నకిలీ కార్డులు ఏరివేసేందుకే ప్రక్రియ
ఆసిఫాబాద్‌అర్బన్: పౌర సరఫరాలశాఖ ద్వారా పే దలకు అందిస్తున్న రేషన్‌కార్డుల్లో నకిలీవి ఏరివేసేందుకు కార్డుదారులతో ఈ–కేవైసీ తప్పనిసరి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. జిల్లాలో ఇంకా చాలామంది ఈ–కేవైసీ చేయించుకో వాల్సి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకునేలా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవోలు, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి రేషన్ డీలర్లకు అవగాహన కల్పించారు.
నూతన కార్డుదారులకు వర్తింపు
జిల్లాలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన నూతన రే షన్ కార్డుదారులు కూడా ఈ ఈ–కేవైసీ తప్పనిసరి గా చేసుకోవాల్సి ఉంటుంది. పాత కార్డుల్లో పేరు తొలగించుకుని వీటిలో చేరినవారు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకు న్నా ప్రస్తుతం రేషన్ లభిస్తుంది. కానీ, ఈకేవైసీ చే యించుకోని పక్షంలో మున్ముందు లబ్ధిదారులకు స మస్యలెదురవుతాయని అధికారులు తెలిపారు.
జిల్లాలో స్పందన అంతంతే..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 315 రేషన్ దుకాణాలు న్నాయి. వీటి పరిధిలో 1,62,422 రేషన్‌కార్డులున్నా యి. వీటిలో 5,33,186 యూనిట్లున్నాయి. వీరికి ప్రతీనెల 3,141 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. మొత్తం రేషన్‌కార్డుల ఇకేవైసీ ప్రక్రియలో ఇప్పటివరకు 66శాతం ప్రక్రియ పూర్తయింది. మిగతా 34శాతం పూర్తి కావాల్సి ఉంది. ప్రతీ రేషన్‌కార్డు ద్వారా లబ్ధి పొందేవారు తప్పనిసరిగా త్వరగా ఈ–కేవైసీ చేయించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
నకిలీకార్డులను ఏరివేసేందుకే..
ఈ–కేవైసీ చేయించుకోని వారికి గతంలో ప్రభుత్వం బియ్యం నిలిపివేస్తామని పలుసార్లు హెచ్చరించింది. అయినా.. ఇంకా కొంతమంది జాప్యం చేస్తున్నా రు. ఇందుకు కారణం ఆధార్‌కు ఈ–కేవైసీ యంత్రానికి అనుసంధానం చేయడంతో బినామీ పేర్ల మీద బియ్యం తీసుకోకుండా అడ్డుకట్ట వేయడం సులభం కానుంది. దీంతో రేషన్ షాపులో బియ్యం పంపిణీ మరింత సమర్థవంతంగా అమలు కానుంది.
తప్పనిసరి చేయించుకోవాలి
ఈ–కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం నుంచి ఇదివరకే ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు జిల్లాలో 66శాతం ప్రక్రియ పూర్తయింది. మిగతా రేషన్‌కార్డుదారులు కూడా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ–కేవైసీ చేసుకునే విధానంలో ఏమైనా సందేహాలుంటే తప్పనిసరిగా సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలి.
– వసంతలక్ష్మి, డీఎస్వో


