ఈ ఎస్వో మేడం మాకొద్దు
వాంకిడి: ‘ఈ ఎస్వో మేడం మాకొద్దు.. పాఠశాలలో ఉంటే మేమైనా ఉండాలి.. లేదా ఆవిడైనా ఉండా లి.. ఆమె టార్చర్ భరించలేకపోతున్నాం..’ అని కే జీబీవీ విద్యార్థినులు వాపోయారు. అసభ్య పదజా లంతో ఇష్టమొచ్చినట్లు తిట్టడం, తమ తల్లి దండ్రులను కించపరిచి మాట్లాడటం ఆమెకు అలవాటైందని ఆరోపించారు. వెంటనే ఎస్వోపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో శని వారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించగా ఎస్వో మీ నాపై విద్యార్థినులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తల్లిదండ్రులతో కలిసి బయటికి వచ్చారు. ఎస్వో మేడమ్‌ను సస్పెండ్ చేయాలని నినదించారు. ర్యా లీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. తమను ఎస్వో కులం పేరిట తి డుతున్నారని, జ్యోతీ బాఫూలే ఫొటోలు పడేయాల ని.. మాలికులస్తులను కించపరుస్తున్నారని ఆరో పించారు. ‘ట్రాన్స్ జెండర్లు, బికారీలు మీకు తిండి దండగా.. మీ కంటే బర్రెలను పెంచుకుంటే నయం.. కనీసం పాలైనా ఇస్తాయి?..’ అని అసభ్య పదజా లంతో తిడుతున్నారని వాపోయారు. కొద్దిరోజులు గా గుడ్లు కూడా ఇవ్వడం లేదని, బండలు మోయించడం లాంటి పనులు చేయిస్తున్నారని తెలిపారు. వెంటనే ఎస్వో మేడమ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి తల్లి దండ్రులతో మాట్లాడి శాంతింపజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.


