రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: రోడ్డు భద్రత మాసోత్సవాలను విజ యవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రవాణాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, శాంతి భద్రతల డీజీపీ మహేశ్ భగవత్, ఇత ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, రవా ణా, ఇంజినీరింగ్, మున్సిపల్ విద్యుత్, వైద్యారో గ్య, విద్యాశాఖ, జాతీయ రహదారుల సంస్థ అధి కారులతో రహదారి భద్రత మాసోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు ని యమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను అధికారులు గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, రహదారులు, భవనాలు, మున్సిపల్ శాఖల అధికా రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి భద్రత మాసో త్సవాలను నెలపాటు నిర్వహించేందుకు చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ప్రతినెలా జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనిన్నారు.


