భవిత కేంద్రం ప్రారంభం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కేంద్రంగా ఏర్పాటు చేసిన భవత కేంద్రాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శనివారం అదనపు కలెక్టర్ డీఈవో దిపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్య, మానసిక, సామాజికాభివృద్ధికి భవిత కేంద్రం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్ర త్యేకావసరాలు గల పిల్లలను గుర్తించి వారికి తగిన సాయం అందించడమే భవిత కేంద్రాల లక్ష్యమని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయులకు కలెక్టర్ అభినందన
స్వచ్ఛ్ ఎవం హరిత విద్యాలయ రేటింగ్‌లో నిలిచిన స్కూల్ ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అభినందించి ఐటీవోసీ సర్టిఫికెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛ్ ఎవం హరిత విద్యాలయాలుగా జిల్లాలో ఏడు పాఠశాలకు మంచి రేటింగ్ వ చ్చిందని తెలిపారు. విద్యాసంస్థలు విద్యాబోధనకే పరిమితం కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత జీవన విధానాలపై విద్యార్థుల్లో అవగా హన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. స్వచ్ఛ్ విద్యాలయ కార్యక్రమం ద్వారా విద్యార్థులు బాధ్యతాయుత పౌరులగా మారే లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ క్రమంలో ఏడు పాఠశాలలు సమగ్ర స్కోరుతో 5.4 స్టార్ రేటింగ్‌ను దక్కించుకుని ఆదర్శంగా నిలిచాయని వివరించా రు. అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


