వాన.. వరదగా.. | - | Sakshi
Sakshi News home page

వాన.. వరదగా..

Aug 17 2025 6:11 AM | Updated on Aug 17 2025 6:11 AM

వాన..

వాన.. వరదగా..

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు పలు చోట్ల నిలిచిన రాకపోకలు నీట మునిగిన పంట పొలాలు అడ ప్రాజెక్ట్‌ ఆరు గేట్లు ఎత్తివేత వట్టివాగు ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లూ.. పలు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌/దహెగాం/పెంచికల్‌పేట్‌/తిర్యాణి/కాగజ్‌నగర్‌ టౌన్‌/కాగజ్‌నగర్‌ రూరల్‌/రెబ్బెన/కెరమెరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవా రం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమురంభీం (అడ), వ ట్టివాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి, తుంపెల్లి, అప్పపల్లి వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయమై పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది.

ఆయా మండలాల్లో..

దహెగాం మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఐనం గ్రామ సమీపంలోని కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారిలో రెండు లోలెవల్‌ వంతెనల పైనుంచి వరదనీరు వెళ్తుండగా రెండు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రం నుంచి కల్వాడ వైపు వెళ్లే మార్గంలో లోలెవల్‌ వంతెనపై వరద పారడంతో అటువైపు వెళ్లేవారు హత్తిని మీదుగా ప్రయాణించారు. మల్లన్న ఒర్రె ఉప్పొంగడంతో సమ్మక్క గద్దెల వద్ద నుంచి వరద పారింది. సబ్‌కలెక్టర్‌ శ్రద్దాశుక్లా దహెగాంతోపాటు ఐనం, పెసరికుంట గ్రామాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. ఈమె వెంట తహసీల్దార్‌ మునవా ర్‌ షరీఫ్‌, ఎంపీడీవో రాజేందర్‌, పంచాయతీ కార్యదర్శులు రాజేశ్‌, ప్రణీత్‌బాబు ఉన్నారు. పెంచికల్‌పేట్‌ మండలంలోని పెద్దవాగు, ఉష్కమల్లవాగు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తగూడ, పెంచికల్‌పేట్‌ గ్రామాల్లో పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరింది. పెంచికల్‌పేట్‌–సలుగుపల్లి, గుండెపల్లి–కమ్మర్‌గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. లింగాపూర్‌ మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగాయి. వంతెనలపై వరదనీరు ప్రవహించడంతో పిట్టగూడా, మోతీపటార్‌, గుమ్నూర్‌, కంచ న్‌పల్లి, ఫూల్‌సింగ్‌తండా, చోర్‌పల్లి, నాగుగూడా, కీ మానాయక్‌తండా, పట్కల్‌మంగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. తిర్యాణి మండలంలోని మాణిక్యపూర్‌ నుంచి మంగి గ్రామానికి వెళ్లే దారిలోగల బ్రిడ్జిపై వాగునీరు ప్రవహించడంతో రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెలి మల ప్రాజెక్ట్‌ అలుగు పారి జలపాతాన్ని తలపించగా స్థానికులు ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్వారకానగర్‌, సంజీవయ్య కాలనీ, శ్రీరాంనగర్‌ కాలనీ, తొమ్మిదోవార్డు, కాపువాడ తదితర ప్రాంతా లను వరదనీరు ముంచెత్తింది. ఆర్‌ఆర్‌వో కాలనీలో ని కేజీబీవీ, ఎస్సీ హాస్టల్‌ ఆవరణలో వరదనీరు చేరగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వెనుకబడి న తరగతుల సంక్షేమాధికారి సజీవన్‌ హాస్టల్‌కు చే రుకుని పరిస్థితిని మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్‌ స్పందించి వరద నీటిని బయటకు పంపించారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ కాలనీలో పలువురు ఇళ్లలోకి వరదనీరు చేరింది. కాలనీని ఆర్‌ఐ సౌమ్య, పంచా యతీ అధికారులు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కాలనీకి ఎగువ నుంచి వరదనీరు వస్తున్న ప్రదేశాన్ని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ పరిశీలించి మ ళ్లింపు చర్యలు చేపట్టారు. గంగాపూర్‌, పులికుంట, పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహించాయి. నంబాల బ్రిడ్జి పైనుంచి వరదనీరు ప్రవహించడంతో నంబా ల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్‌ బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. ఎస్సై చంద్రశేఖర్‌ నంబాల బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేశా రు. ఖైరిగూర ఓసీపీలో ఉత్పత్తి నిలిచిపోయింది. కా గజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, మెట్‌పల్లి, గజ్జి గూడ, మోసం, కోయవాగు తదితర వాగులు ఉ ప్పొంగాయి. పెంచికల్‌పేట్‌–కాగజ్‌నగర్‌ ప్రధాన ర హదారిలో ఈజ్‌గాం వద్ద రోడ్డుపై నీరు ప్రవహించగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ జ్‌గాం చౌరస్తా, ఎస్సీ కాలనీలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. మెట్‌పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ సందర్శించి వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ రామానుజం, రూరల్‌ ఎస్సై కుమారస్వామి ఉన్నారు. కెరమెరి మండలంలోని కర్పెతగూడ వంతెన పూర్తిగా నీటి మునిగింది. లక్మాపూర్‌, అనా ర్‌పల్లి, వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 15 గ్రామాల ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. చాలాకాలం తర్వా త కెరమెరి, సాంగ్వి, గోయగాం వాగులు పొంగిపొర్లాయి. సాంగ్వి, రాంపూర్‌, ఇంద్రానగర్‌, కెలికే కల్వ ర్టు పైనుంచి వరదనీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. వాగు పరీవాహక ప్రాంతంలో 50 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి.

తిర్యాణి మండలం మాణిక్యపూర్‌ వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న వాగునీటి నుంచి దాటుతున్న ప్రజలు

మండలాలవారీగా

వర్షపాతం నమోదు ఇలా..

జిల్లాలో అత్యధికంగా కౌటాల మండలంలో 65.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కాగజ్‌నగర్‌లో 7.8 మి.మీ వ ర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 25.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తిర్యాణిలో 27.8 మి.మీ, ఆసిఫాబాద్‌లో 30.8, రెబ్బెనలో 8, జైనూర్‌లో 16.4, సిర్పూర్‌ (యూ)లో 15.6, లింగపూర్‌లో 30.8, కెరమెరి 16.2, వాంకిడిలో 10.8, సిర్పూర్‌ (టీ)లో 16.8, చింతలమానెపల్లిలో 29.2, పెంచికల్‌పేట్‌లో 40.4, బెజ్జూర్‌ 47.2, దహెగాం మండ లంలో 25.2 మి.మీ వర్షం కురిసింది.

ప్రాజెక్ట్‌లకు భారీగా వరదనీరు

ఎగువ నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా కుమురంభీం (అడ) ప్రాజెక్ట్‌ ఆరు గేట్లు ఎత్తి 52,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ సామర్థ్యం 10.393 టీఎంసీలు (234 మీటర్లు) కాగా, ప్రస్తుతం 5.968 టీఎంసీ లుగా ఉంది. 52,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఆరు గేట్లు ఎత్తి దిగువకు అంతే మొత్తంలో వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్ట్‌ నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్ట్‌ సామర్థ్యం 2.890 టీఎంసీలు (238.75 మీటర్లు) కాగా, ప్రస్తుతం 2.579 టీఎంసీలుగా ఉంది. 9,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా నాలుగు గేట్లు ఎత్తి 10,830 క్యూసెక్కుల ను దిగువకు వదులుతున్నారు. దీంతో గుండి, ఆ సిఫాబాద్‌ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దిగువన గల గుండి, రాజుర, రహపల్లి, చోర్‌పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్‌ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు పోవద్దని అధికారులు సూచించారు.

వాన.. వరదగా..1
1/2

వాన.. వరదగా..

వాన.. వరదగా..2
2/2

వాన.. వరదగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement