
పింఛన్లు పెంచాలని డిమాండ్
కౌటాల: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి గుండ థామస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శని వారం కౌటాల జగదాంబ గార్డెన్ పింఛన్‌దారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్‌దారుల సమస్యలు ప రిష్కరించడంతో పూర్తిగా విఫలమైనట్లు ఆరోపించారు. ఈ నెల 21న కౌటాలలో తలపెట్టిన పింఛన్‌దారుల సభలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పిట్టల సత్యనారాయణ, విఠల్, రాజేశ్, హీరమాన్, తిరుపతి, శంకర్, బాలయ్య, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు.