
ద్విచక్రవాహనాలు స్వాధీనం
రెబ్బెన: సింగరేణి ఆస్తులున్న ప్రదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు ఎస్‌అండ్‌పీసీ సిబ్బందిని చూసి పరారవడంతో వారి ద్విచక్రవాహనాలను బె ల్లంపల్లి ఏరియా ఎస్‌అండ్‌పీసీ అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఎస్‌అండ్‌పీసీ ఇన్‌చార్జి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 13న మధ్యాహ్నం ఏరియాలోని గోలేటి–1ఏ ఇంక్లైన్ ఆవరణలో కి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు ద్విచ క్ర వాహనాలపై అక్రమంగా ప్రవేశించారు. మద్యం తాగుతూ చోరీకి పాల్పడే అవకాశమున్నట్లు అనుమానించిన ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది వెంటనే మొబై ల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించా రు. వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లడాన్ని చూసిన అనుమానితులు వారి వెంట తీసుకువచ్చిన ద్విచక్రవాహనాలు అక్కడే వదిలేసి పారిపోయారు. అనుమానితుల ద్విచక్రవాహనాలను సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. విఽధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్‌అండ్‌పీసీ ఇన్‌చార్జి అభినందించారు.