
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
న్యూస్‌రీల్
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి అండర్–15 వాలీబాల్ పోటీలకు 16మంది విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి వెంకటేశం, కోచ్ రాకేశ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర పోస్ట్‌మెట్రిక్ వసతిగృహం మైదానంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. స్కూల్ గేమ్స్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉత్త మ ప్రతిభ కనబర్చిన ఎనిమిది మంది బాలికలు, ఎనిమిది మంది బాలురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరు ఈ నెల 18, 19తేదీల్లో రంగారెడ్డిలోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
రోడ్డు వేయాలని ఆందోళన
కాగజ్‌నగర్ రూరల్: మండలంలోని అందవెల్లి–భట్టుపల్లి గ్రామాల మధ్య రోడ్డు వేయాల ని శనివారం గ్రామస్తులు ఆందోళన చేశారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు ఉంచి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు బురదమయమై నడిచి వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నా నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. కాగా, వీరి ఆందోళనతో దహెగాం–కాగజ్‌నగర్ మార్గంలో వాహనాలు ఎ క్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలు సుకున్న కాగజ్‌నగర్ రూరల్, పట్టణ సీఐలు కుమారస్వామి, ప్రేంకుమార్, ఎంపీడీవో ప్ర సాద్ ఆందోళన వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చించారు. శాశ్వత పరిష్కారం కల్పించేదాకా నిరసన కొనసాగిస్తామని, అధికారులు స్పందించి పేరుకుపోయిన బురద తొలగించాలని, తాత్కాలిక రోడ్డు వేయాలని కోరారు.