‘ఇంటర్‌’కూ పీటీఎం | - | Sakshi
Sakshi News home page

‘ఇంటర్‌’కూ పీటీఎం

Aug 17 2025 6:11 AM | Updated on Aug 17 2025 6:11 AM

‘ఇంటర్‌’కూ పీటీఎం

‘ఇంటర్‌’కూ పీటీఎం

● హాజరు, ఉత్తీర్ణత పెంపునకు చర్యలు ● అమలుకు ‘ఇంటర్‌’ బోర్డు నిర్ణయం ● నెలలో నాలుగో శనివారం సమావేశం ● కసరత్తు ప్రారంభించిన అధికారులు

కెరమెరి(ఆసిఫాబాద్‌): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం పెంపున కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లు (పీటీఎం) నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందించింది. తరగతి గదిలో తమ పిల్లలు చదువుతున్న తీ రు, ప్రవర్తన, హాజరు గురించి తల్లితండ్రులు తెలు సుకునే అవకాశముంది. అలాగే ఇంటి వద్ద విద్యార్థులు చదువుతున్నారా.. లేదా.? గైర్హాజరుకు కారణాల గురించి అధ్యాపకులు తల్లిదండ్రులను ఆరా తీసే అవకాశమేర్పడింది. ఇది విద్యార్థులు తమ సా మర్థ్యాలను మెరుగుపరుచుకుని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడనుంది. అంతిమంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు బలోపేతం కానున్నాయి. ప్రతీనెల నాలుగో శనివారం కళాశాలలో వి ద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌లకు ఆదేశాలు అందాయి.

జిల్లాలో 11 కళాశాలల్లో అమలు

జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నా యి. ఇందులో జనరల్‌ విద్యార్థులు 1,784 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 568 మంది విద్యనభ్యసిస్తు న్నారు. చాలా కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉంది. ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థులు కొందరు కాలేజీ వరకు వెళ్లడం లేదు. ఇంటి వద్ద చదవకపోవడంతో వెనుకబడిపోతున్నా రు. గతేడాది కొంత మెరుగ్గా ఉన్న ఫలితాలు అంతకుముందు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించ డం ద్వారా ఈ సమస్య అధిగమించే అవకాశం ఉంటుందని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు కళాశాలల్లో పీటీఎంలు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

సమావేశంలో ఏం చర్చిస్తారంటే..

పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ గురించి ఆయా కళాశాలల అధ్యాపకులు ముందుగా ఫోన్‌ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. సమావేశం నిర్వహించే తేదీ, సమయాన్ని తెలుపాలి. సమావేశంలో వారి పిల్లల సామర్థ్యాల గురించి అ ధ్యాపకులు వివరించాలి. వారు ఏ దశలో ఉన్నారో తెలుపాలి. ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో చెప్పాలి. మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇంటి వద్ద కూడా చదివించాలని దిశానిర్దేశం చేయాలి. అలాగే తల్లిదండ్రులు కూడా కళాశాల నిర్వహణ గురించి సమావేశంలో తెలుసుకోవాలి. అధ్యాపకు ల పనితీరును గమనించాలి. తద్వారా ఇరువైపులా విద్యార్థులపై శ్రద్ధ పెరిగి వారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది.

హాజరు తగ్గుదలకు కారణాలు

జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీలోని పలు మండలాల్లోగల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల హా జరుశాతం చాలా తక్కువగా ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం, ఆర్టీసీ బస్సులు వేళకు రాకపోవడం లాంటి సమస్యలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చాలావరకు పేదకుటుంబా లవారే కావడంతో ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లే స్తోమత లేక తరచూ గైర్హాజరవుతుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement