
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వాతావరణశాఖ సూచన మేరకు భారీ వర్షా ల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి, రాజురా గ్రామాల్లోని లోలెవల్ వంతెనలను అదనపు కలెక్టర్ డేవిడ్, డీపీవో భిక్షపతిగౌడ్‌తో కలిసి పరిశీలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. రాజురా లోలెవల్ వంతెన ఇరువైపులా కోతకు గురి కాగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం కోసం 8500844365 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.