నేరాల నిర్మూలన కోసమే కార్డన్‌సెర్చ్
తిర్యాణి: నేరాల నిర్మూలన కోసమే కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రెబ్బన సీఐ బుద్దె స్వామి అన్నా రు. మండలంలోని నాయకపుగూడ గ్రామంలో శుక్రవారం 45 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్‌సెర్చ్ చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 200 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గ్రా మంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పో లీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యహరించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు ఎంబడి శ్రీకాంత్, చంద్రశేఖర్, సందీప్, ఏఎస్సైలు నారాయణ, వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


