
ఘనంగా ‘మర్యాదపూర్వక దినోత్సవం’
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం మర్యాదపూర్వక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ట్రాఫిక్ సూపర్వైజర్ భా రతి సిబ్బందితో కలిసి కృతజ్ఞతగా పూలు, క్యూఆర్‌కోడ్ కీచెయిన్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ ఆర్టీసీ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని చెప్పా రు. ప్రయాణికుల గౌరవం, సౌకర్యం కాపాడే దిశగా ప్రతీ ఉద్యోగి పని చేయాలని సూచించారు. అంకితభావంతో ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా నడుచుకుని సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆర్టీసీకి సంబంధించిన అన్ని అధికారిక గ్రూప్‌లతో కనెక్ట్ కావచ్చనే వివరాలు వెల్లడించారు.