భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే

Apr 19 2025 9:30 AM | Updated on Apr 19 2025 9:30 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే

కౌటాల: మండల కేంద్రంలోని కతోలిక చర్చిలో శుక్రవారం గుడ్‌ ఫ్రై డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కౌటాల చర్చి ఫాదర్‌ టోమ్‌ మాట్లాడు తూ.. యేసు క్రీస్తు ప్రేమమయుడని తెలిపారు. తన ప్రేమను రుజువు చేసుకోవడానికి కల్వరిపై తన ప్రా ణం పెట్టినట్లు వివరించారు. యాపలగూడ చర్చిలో ఫాదర్‌ రాజరత్నం క్రైస్తవులకు దేవుని వ్యాకం బో ధించారు. కౌటాల మండలంలోని విజయనగరం చర్చిలో ఫాదర్‌ సీజో, యాపలగూడలో ఫాదర్‌ శేరి న్‌, శివలింగపూర్‌లోని చర్చిలో పాస్టర్‌ సువార్త రాజ న్న, సదాశివపేటలోని చర్చిలో పాస్టర్‌ శ్రీనివాస్‌ క్రైస్తవులకు దేవుని వ్యాకం బోధించారు.

కల్వరి గిరి పై ప్రార్థనలు

మండల కేంద్రంలోని కల్వరి గిరి (గుట్ట) పై క్రైస్తవులు సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండ ల కేంద్రంతో పాటు విజయనగరం, యాపలగూడ, చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రా మాల్లోగల ప్రార్థన మందిరాల్లోని క్రైస్తవులంతా క్రీ స్తు కీర్తనలు పాడుతూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కల్వరి గిరి పైకి ర్యాలీగా వెళ్లారు. అనంతరం క్రైస్తవులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే1
1/1

భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement