పల్లె వనం.. కళావిహీనం
● పల్లె ప్రకృతి వనాలను పట్టించుకోని అధికారులు ● నిర్వహణ లేకపోవడంతో ఎండిపోయిన మొక్కలు ● చెత్తాచెదారంతో అధ్వానంగా మారిన వైనం ● ఆహ్లాదానికి దూరమవుతున్న ప్రజలు
పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో సరైన నిర్వహణ లేక పల్లె వనాల పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.లక్షల ప్రజా ధనాన్ని వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోయాయి. కొత్తగా మళ్లీ నాటకపోవడంతో క్రమంగా పచ్చదనం కనుమరుగవుతోంది. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1,100 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రాల్లో బృహత్ ప్రకృతి వనాలు సైతం ఏర్పాటు చేశారు. ఒకవైపు పచ్చదనం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా వీటిని సిద్ధం చేశారు. నిర్వహణ సక్రమంగా లేక విపరీతంగా గడ్డి పెరిగి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మొక్కలు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు వేసవి వచ్చినా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల స్థితిగతులపై ‘సాక్షి’ విజిట్..
నీరు లేక నిర్జీవం
కెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో మొక్కలు నీరు లేక ఎండిపోయాయి. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత మొక్కల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. జామ, సీతాఫ లం మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి. సీతాఫలం, దాని మ్మ, నిమ్మ, జామ, అరటి తదితర మొక్కలు సుమారు వెయ్యి వరకు నాటితే ప్రస్తుతం నిమ్మ చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
కౌటాల: శీర్షా పల్లె ప్రకృతి వనంలో ఎండిన మొక్కలు
ఐనంలో ‘కోనోకార్పస్’
దహెగాం: కోనోకార్పస్ చెట్లతో ఎలాంటి ఉపయోగం లేదని, వాటి పూల పుప్పొడితో శ్వా సకోశ ఇబ్బందులు తలెత్తుతాయని చాలాచోట్ల ఆ మొక్కలను నాటడం పూర్తిగా నిలిపివేశారు. గతంలో నాటిన మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనంలో కోనోకార్పస్ చెట్లు పెంచుతున్నారు. చిన్న ఐనం, పెద్ద ఐనం రెండు గ్రామాలకు చెందిన పల్లె ప్రకృతి వనాలు ఒకేచోట ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు ఆరువేల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొక్కలు నాటి రెండేళ్లవుతుంది. చెట్లు ఏపుగా పెరిగాయి. నీళ్లు పోయకపోవడంతో కొన్నిమొక్కలు ఎండిపోతున్నాయి. కేవలం కోనోకార్పస్ చెట్లు మాత్రమే పచ్చగా ఉన్నాయి. దీంతో ప్రకృతి వనంలోకి స్థానికులెవరూ వెళ్లడం లేదు.
పల్లె వనం.. కళావిహీనం
పల్లె వనం.. కళావిహీనం
పల్లె వనం.. కళావిహీనం


