● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్‌ మోసాలు ● రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ కేటుగాళ్లు ● అప్రమత్తత అవసరమంటున్న పోలీసులు | - | Sakshi
Sakshi News home page

● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్‌ మోసాలు ● రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ కేటుగాళ్లు ● అప్రమత్తత అవసరమంటున్న పోలీసులు

Apr 3 2025 1:04 AM | Updated on Apr 3 2025 1:04 AM

● లిం

● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్‌ మోసాలు ● రెచ్చిపోతున

ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు

జిల్లాలో కొద్దిరోజులుగా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. మోసపూరిత ప్రకటనలు, ఆన్‌లైన్‌లో డబ్బులు ఎక్కువ ఇస్తామంటే నమ్మొద్దు. అనుమానిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లు ఓపెన్‌ చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్‌ నేరానికి గురై నగదు పోగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌, సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ 1930కి ఫోన్‌ చేయాలి. సంబంధిత ఖాతా నుంచి నగదు విత్‌డ్రా కాకుండా చూస్తాం. లాటరీ విధానం కూడా నిషేధంలో ఉంది. కొత్త రకం మోసాలపైనా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ

అప్రమత్తత అవసరం..

మార్కెట్లలోని షాపులు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర దుకాణాల్లో మనం ఇచ్చే ఫోన్‌ నంబర్‌, సోషల్‌ మీడియాలో సమాచారం సైబర్‌ మోసగాళ్లు అనువుగా మార్చుకుంటున్నారు. ఆసిఫాబాద్‌, రెబ్బెన, కాగజ్‌నగర్‌ పట్టణాల్లోని యువకులు అవగాహన ఉండి కూడా మోసాలకు గురవుతున్నారు. మరోవైపు మారుమూల మండలాలు బెజ్జూర్‌, చింతలమానెపల్లి, లింగాపూర్‌, తిర్యా ణి ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయి అవగా హన లేకపోవడంతో సైబర్‌ నేరాలు గురవుతున్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్‌తో సైబర్‌ వారి యర్స్‌ ఏర్పాటు చేశారు. బాధితులు నేరుగా వారిని సంప్రదించవచ్చు. జిల్లాలోని 335 గ్రా మ పంచాయతీల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక మోసాలు, చిన్నారులు, మహిళలు, ఇతర సైబర్‌ నేరా లకు సంబంధించి వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చే యవచ్చు. ఆర్థిక మోసాలకు సంబంధించి ఫి ర్యాదు చేసే సమయంలో సంబంధిత బ్యాంకు/వాలెట్‌, లావాదేవీకి సంబంధించి 12అంకెల ఐడీ/యూటీఆర్‌ నంబర్‌, మోసం జరిగిన తేదీ, ఎంత మొత్తం, ఇందుకు అవసరమైన సాఫ్ట్‌కాపీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. http://ww w.cybercrime.gov.in వైబ్‌సైట్‌ ద్వారా, లేదా 1930 నంబరుకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

కౌటాల(సిర్పూర్‌): ఇది డిజిటల్‌ యుగం. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతీ పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్లు.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు సాంకేతికత ఆధారంగా మోసాలు పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసంతో బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. అత్యాశ, అవగాహన లేకపోవడంతో ఏటా జిల్లాలో వందలాది మంది మోసపోతున్నారు.

ఆశ చూపి మోసాలు..

కొద్దరోజులుగా ఫోన్‌ నుంచి ఇతరులకు కాల్‌ చేస్తే ‘జాగ్రత్త తెలియని నంబర్‌ నుంచి మీకు కాల్‌ చేసి మేము పోలీసులమని, బ్యాంక్‌ అధికారులమని మాట్లాడితే మీరు మోసపోకండి’ అంటూ ఆన్‌లైన్‌ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ విధంగా కాలర్‌ రింగ్‌టోన్‌ వస్తోంది. డిజిటల్‌ అరెస్టుల పేరుతో జరిగే మోసాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం చేస్తోంది. పలు మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నా ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో 2023లో 34 కేసులు నమోదు కాగా, 2024లో 21 సైబర్‌ కేసులు నమోదయ్యాయి.

● క్రెడిట్‌ కార్డుల పేరిట ఓటీపీ పంపి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సొమ్మును అధికారిక వెబ్‌సైట్‌ తరహాలో లింకులు పంపి దోచుకుంటున్నారు.

● లాటరీ వచ్చిందని నగదు బహుమతి అందుకునేందుకు ఖర్చుల కింద కొంత నగదు కట్టాలంటూ మాయమాటలతో అమాయకుల నుంచి రూ.లక్షలు లాగేస్తున్నారు.

● సైబర్‌ నేరగాళ్లు బాధితుల ఫోన్‌పే, ఇతర యూపీఐ యాప్‌లకు ముందుగా కొంత డబ్బు పంపి.. తెలియకుండా మీ నంబర్‌కు మా డబ్బులు వచ్చాయని తిరిగి పంపించాలని కోరుతున్నారు. సదరు వ్యక్తి ఎవరో గ్రహించకుండా తిరిగి ఆ నగదును పంపిస్తే వెంటనే ఖాతాలోని మిగిలిన మొత్తం కూడా ఖాళీ అవుతోంది.

● సోషల్‌ మీడియాలోని ఫొటోలను మార్ఫింగ్‌ ద్వారా అసభ్యంగా మార్చి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్నారు. అలాగే అసభ్యకరమైన కామెంట్లు చేయడం, ఫేక్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి ప్రేమ వ్యవహారంతో నమ్మించి వంచిస్తున్నారు.

● నిషేధిత యాప్‌ల్లో డబ్బులు రెట్టింపు వస్తాయనే ఆశతో యువత ఎక్కువగా మోసపోతున్నారు.

● వాట్సాప్‌లో గుర్తుతెలియని నంబర్లతో న్యూడ్‌ వీడియోకాల్‌ చేసి రికార్డింగ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ప్రజాప్రతినిధులకు ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యాయి.

● సైబర్‌ మోసాలకు గురవుతున్న వారిలో విద్యావంతులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య రైతులు, సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారే అధికంగా ఉంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్‌ మోసాలు ● రెచ్చిపోతున1
1/1

● లింకులు, ఓటీపీలతో పెరిగిన సైబర్‌ మోసాలు ● రెచ్చిపోతున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement