ఆసిఫాబాద్‌అర్బన్: అక్రమాలకు పాల్పడుతున్న ఆ దిలాబాద్ ఆర్‌ఎంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీయూసీ ఆ ధ్వర్యంలో హైర్‌బస్ డ్రైవర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియమించుకుంటున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నా రు. ఇందుకోసం ఆసిఫాబాద్ డిపో నుంచి సుమా రు 250 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో ప్రైవేట్ హైర్‌బస్సు డ్రైవర్లు కూడా ఉండగా, వీరికి ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్ ఎం, పీవో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరో పించారు. కమిషన్లు, పైరవీలకు పెద్దపీట వేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా కొంతమందిని రిక్రూట్ చేసున్నారని మండిపడ్డారు. ఆ నియామకాలను ర ద్దు చేసి పీహెచ్‌బీ డ్రైవర్లను ఎలాంటి షరతులు లేకుండా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 4లోపు సమస్య పరిష్కరించుకుంటే 5 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని డీఎంకు వినతిపత్రం అందించారు. డిపో అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కా ర్యదర్శి షఫీక్, బాలేశ్, భాస్కర్, తిరుపతి, శోభ న్, విజయ్‌కుమార్, సాయి, గణేశ్, ఇమామ్, హైమ ద్, నవీన్, భీంరావ్, గోపాల్, అంజి పాల్గొన్నారు.


