కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో ఇంగ్లిష్ అంటే భయం పోగొట్టి.. వెనుకబడిన విద్యార్థులు సైతం చదవడం, రాయడం, మాట్లాడటంలో ప్రతిభ చూపేలా కృషి చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్‌టీ) కె.ప్రవీణ్‌కుమార్‌ను అవార్డు వరించింది. ఉట్నూర్‌లోని పీఎంఆర్‌సీ భారత్ దేఖో సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం యంగ్ ఓరేటర్ క్లబ్(వైఓసీ) అ వార్డుల ప్రదానోత్సవం జరిగింది. కెరమెరి మండలం రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్‌టీ ప్రవీ ణ్‌కుమార్ ఉత్తమ ఇంగ్లిష్ టీచర్‌గా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. గత నెల 20న రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సందర్శించారు. విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యతను గుర్తించా రు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్ కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఏసీఎంవోలు పుర్క ఉద్దవ్, జగన్ అవార్డు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లాలో 16 మందిని అవార్డు చేయగా, ఇందులో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు.


