ఆసిఫాబాద్‌అర్బన్: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్‌లో జైబాపు, జైభీమ్, జైసంవిధాన్, జైభారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేపదే మాట్లాడటం సరికాదని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న రాజ్యాంగ మార్పు భావనను ఖండించడంతో పాటు దాని అవసరాన్ని ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్‌కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్‌గా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మండలాధ్యక్షుడు చరణ్, నాయకులు ఖలీం, మారుతీపటేల్ తదితరులు పాల్గొన్నారు.