ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ పురస్కార వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమలాగార్డెన్‌లో ని ర్వహించనున్నట్లు సినీ దర్శక, నిర్మాత డీ సురేశ్‌బా బు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీచైత న్య కళాశాలలో విలేకరులతో మాట్లాడారు. నవజ్యో తి సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు, డై లా గ్ కింగ్ సాయికుమార్ సినీ జీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓంసాయి తేజ ఆర్ట్స్, నవజ్యోతి సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయికుయార్, మాజీ ఐఏఎస్ పార్థసారధి, హాస్యనటుడు బాబుమోహన్, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, నిర్మాతలు రాహుల్‌యాదవ్, విజయ్‌కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. కళాకారులంతా విజ యవంతం చేయాలని కోరారు. ఆయా సంఘాల ప్రతనిధులు సిడాం అర్జుమాస్టర్, ధర్మపురి వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, ముప్పా శేఖర్, రాధాకృష్ణాచారి, బాపూరావ్, మధు హనుమాండ్ల ఉన్నారు.