● కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య తాను పుట్టుకతో దివ్యాంగుడినని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎర్ర లక్మీకాంత్ తనకు గిరి వికాసం పథకంలో మంజూరైన బోరుకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించాడు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్‌కు చెందిన గైని మొగిలి తాను చేస్తున్న పోడు భూమిని సర్వే నిర్వహించి పట్టా మంజూరు చేయాలని వేడుకున్నాడు. బెజ్జూర్ మండలం కుకుడ గ్రామానికి చెందిన యెరుగు రమేశ్ తమ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల భవన మరమ్మతులు చేపట్టాలని కోరాడు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ఓంకార్ అభిలాష్ తన తండ్రి పేరిట దహెగాం మండలం కమ్మర్‌పల్లి శివారులో ఉన్న లావుని పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఈ విషయమై తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. హన్మకొండ జిల్లాకు చెందిన మీర్‌సలీం అలీ తనకు కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామ శివారులో ఉన్న పట్టా భూములకు పట్టాదారు పాస్తు పుస్తకాలు జారీ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రెబ్బెన మండలం పాసిగాం గ్రామానికి చెందిన శాంతాబాయి తనకు గల పట్టాభూమి ధరణి పోర్టల్‌లో మిస్సింగ్ అయినందున తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆధార్‌కార్డు ఇప్పించండి
నేను కొన్ని సంవత్సరాలు గా రెబ్బెన మండలంలో ని వాసం ఉంటున్నా. నాకు మాత్రం ఆధార్‌కార్డు ఇచ్చా రు. ప్రస్తుతం నాకు ఐదుగు రు పిల్లలు ఉన్నారు. వారికి ఎక్కడికి వెళ్లినా ఆధార్‌కార్డు ఇవ్వడం లేదు. దీంతో పాఠశాలలకు వెళ్లలేక ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పటికై నా చిన్నారుల విద్యాభ్యాసం దృష్టిలో ఉంచుచుని ఆధార్‌కార్డు మంజూరు చేయాలి. – బికె.సింగ్, రెబ్బెన
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి


