
క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: ఉమ్మడి జిల్లా గిరిజన ఆదర్శక్రీడా పాఠశాలలో ప్రవేశానికి జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడాపాఠశాలలో బుధవారం ఎంపిక పోటీలు నిర్వహించినట్లు డీటీడీవో రమాదేవి తెలిపారు. ఐదో తరగతిలో 40 సీట్లకు 60 మంది, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లు కోసం 80 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన 40 మంది బాలికలను ఎంపిక చేస్తామన్నారు. అనంతరం తిర్యాణి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పీడీ లక్ష్మణ్ ఇటీవల బాడీబిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆదిలాబాద్ టైటిల్‌ని సొంతం చేసుకోవడంతో డీఎస్‌వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, డీటీడీవో రమాదేవి శాలువాతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీడీలు పీఈటీలు మధుసూదన్, సంగీత, వెంకటేశ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.