వాంకిడి(ఆసిఫాబాద్): బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రానీయొద్దని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సజీవన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతిగృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటగది, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా మెనూ పాటిస్తూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. వసతిగృహాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పూర్తినమ్మకంతో కష్టపడి చదవాలన్నారు. పరీక్షల తీరుపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బీసీ హాస్టల్ వార్డెన్ మధుకర్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ తిరుపతి తదితరులు ఉన్నారు.


