
వినతిపత్రం అందిస్తున్న సభ్యులు
కాగజ్‌నగర్‌టౌన్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రాసిటీ ఎంప్లాయీస్ యూనియన్– 1104 రాష్ట్ర అధ్యక్షుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత వేమునూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌లోని విద్యుత్ కార్మిక భవన్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం విద్యుత్ సంస్థలోని కార్మికుల పెండింగ్ ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని, ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలు పరిష్కరించాలన్నారు. దీంతోపాటు ప్రతీ కార్మికుడికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విలాస్‌కుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రమేశ్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్, అదనపు కార్యదర్శి మహేందర్, డివిజన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.