ఖమ్మం సహకారనగర్: కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్‌ఐఈ)కు జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బయలుదేరారు. నాయకత్వ లక్షణాల పెంపులో భాగంగా శిక్షణకు వారు హాజరుకానున్నారు. జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు వెళ్తున్న బస్సును శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ నేతృత్వాన ఈ పర్యటన కొనసాగనుంది. పాఠశాలల నిర్వహణ, బోధనలో అవసరమైన నాయకత్వ లక్షణాలపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నారు.


