సౌర విద్యుత్ భరోసా!
సౌర విద్యుత్‌కు ప్రాధాన్యత
నిత్యం రెండు మెగావాట్ల ఉత్పత్తి
● ఈ సమయాన అండగా నిలుస్తున్న సోలార్ విద్యుత్ ● ఉమ్మడి జిలాల్లో రోజుకు 65 మెగావాట్ల ఉత్పత్తి ● గ్రిడ్‌పై తగ్గనున్న భారం.. వినియోగదారులకు బిల్లుల లాభం
పీఎం సూర్యఘర్
ఈ పథకం ద్వారా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలో భాగంగా కేంద్రప్రభుత్వం మూడు కిలోవాట్ల యూనిట్‌కు రూ.78వేల సబ్సిడీ ఇస్తోంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో 13,957 మంది దరఖాస్తు చేసుకోగా, 9,042 మంది ఇళ్లపై ఫలకాల ఏర్పాటు పూర్తయింది. ఫలితంగా 25.84 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పథకం కింద ప్రోత్సాహకంగా లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.52 కోట్ల సబ్సిడీ అందింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద 4,893 మంది దరఖాస్తు చేసుకుంటే 3,053 మంది ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తవగా 11.11 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, లబ్ధిదారులకు కేంద్రం నుంచి రూ.19 కోట్లు జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా వినియోగదారుల విద్యుత్ బిల్లు సున్నా కావడంతో పాటు మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.57 చొప్పున గ్రిడ్‌కు అమ్ముకునే వెసులుబాటు ఉంది.
పీఎం కుసుమ్
రైతులు తమ భూమిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి డిస్కంకు విద్యుత్ అమ్మే పథకం ఇది. ఖమ్మం జిల్లాలో 76మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 54 ప్లాంట్లు ఏర్పాటు పూర్తికాగా, 11 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలో 12 దరఖాస్తుల ద్వారా 16 మెగా వాట్ల సామర్థ్యం పనులు కొనసాగుతున్నాయి. బీడు భూ ములు, సాగులో లేని భూముల్లో ఈ పథకం ద్వారా రైతులు ప్లాంట్లు ఏర్పాటు చేసే వీలుంది. యూనిట్ కు రూ.3.13 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఇందిరా మహిళాశక్తి
మహిళా సంఘాల ఆధ్వర్యాన ఎర్రుపాలెం మండలం వెంకటాపురం సబ్ స్టేషన్ పరిధిలో ఒక మెగావాట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయగా, ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. కల్లూరు మండలం చిన్నకోరుకొండిలో ఒక మెగావాట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. అలాగే, భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలం, లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడుతనేనిగుంపు గ్రామాల్లో రెండు మెగావాట్ల పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు కేటాయిస్తే.. మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుంది.
గరిష్టస్థాయి డిమాండ్
ఖమ్మం జిల్లాలో రోజుకు 7 మిలియన్ యూనిట్లు, భద్రాద్రి జిల్లాలో 5.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ప్రస్తుతం సోలార్ పథకాల ద్వారా ఖమ్మం జిల్లాలో రోజుకు 52 – 55 మెగావాట్లు, భద్రాద్రి జిల్లాలో 13.70 మెగావాట్లు సోలార్ ద్వారా ఉత్పత్తి అవుతోంది.
IIలో
సౌర ప్లాంట్ల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సాహం అందుతుండడంతో దరఖాస్తులు పెరుగుతున్నాయి. సూర్యఘర్‌కు 2027 మార్చి వరకే అవకాశం ఉంది. అన్నివర్గాల ప్రజలు వినియోగించుకోవచ్చు.
– పొలిశెట్టి అజయ్‌కుమార్, రెడ్‌కో,
ఉమ్మడి జిల్లా మేనేజర్
పీఎం కుసుమ్ పథకం కింద ఆరెకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేశా. డిమాండ్ ఉన్న ఈ సమయాన నిత్యం రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడం తృప్తినిస్తోంది. భూమిలో పంటలే కాదు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయొచ్చని నిరూపణ అయింది.
– బీరెల్లి శ్రీనివాసరావు, జూపెడ,
తిరుమలాయపాలెం మండలం


