నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

Oct 25 2026 12:41 AM | Updated on Oct 25 2026 12:41 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలో నాలుగు లేన్ల రోడ్డు, డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత అభివృద్ధి చేసిన నాయుడుపేట జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌లోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.

నేడు, రేపు మంత్రి తుమ్మల..

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం వేంసూరు మండలం మర్లపాడు, కందుకూరు, దుద్దేపూడి గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 3గంటలకు అశ్వాపురం మండలంలో దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచే పనులను పరిశీలించనున్నారు. అలాగే, సోమవారం ఉదయం రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొంటారు.

రక్తదానంతో ప్రాణదానం

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మంక్రైం: రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్టేనని గుర్తించి ఆరోగ్యవంతులైన ప్రతీఒక్కరు ముందుకు రావాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన శిబిరాన్ని ఆయన ప్రారంభించగా 150 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతగా రక్తదాన శిబి రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్‌ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాసులు, సుశీల్‌సింగ్‌, నర్సయ్య, డాక్టర్‌ కార్తీక్‌, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్‌, అప్పలనాయుడు, సీఐలు సాధిక్‌ పాషా, రామకృష్ణ, చిట్టిబాబు, నాగరాజు కరుణాకర్‌, శివప్రసాద్‌ పాల్గొన్నారు.

శ్రీవారికి అభిషేకం,

నిత్యకల్యాణం

ఎర్రుపాలెం: తెలంగాణగా తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లకు నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక దృష్టితోనే

ఉత్తమ ఫలితాల సాధన

సత్తుపల్లిటౌన్‌: విద్యాబోధన, సైన్స్‌ ప్రయోగాలపై ఇప్పటినుంచే ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి రవిబాబు తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కాలేజీని శనివారం ఆయన తనిఖీ చేశారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరుతో పాటు ఇప్పటివరకు విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల ఫలి తాలపై ఆరా తీశారు. అలాగే, ప్రాక్టికల్‌ పరీక్షల మెటీరియల్‌ను పరిశీలించి మాట్లాడారు. వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తూ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధించాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.భాగ్యలక్ష్మి, అధ్యాపకులు కృష్ణవేణి, కల్పన, వనజారాణి, రామారావు, శ్వేత, రాణి, సమ్మక్క, వెంకటేశ్వరరావు, సీత, సౌజన్య, శిరోమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement