బతుకమ్మ సంబరాల్లో
బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా అందరూ పాటుపడాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. బతుకమ్మ సంబురాలను రెండో రోజైన ఆదివారం కలెక్టరేట్లో సంక్షేమ శాఖల ఆధ్వర్యాన నిర్వహించారు. అధికారులు, మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవం, ప్రకృతిపై మనకున్న ఆరాధనకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.


