పాడితో ఆర్థిక స్వావలంబన | - | Sakshi
Sakshi News home page

పాడితో ఆర్థిక స్వావలంబన

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

బోనకల్‌: ఇందిరా డెయిరీ ద్వారా మొదటి విడతగా పాడి గేదెలు అందుకున్న మహిళలు పాల అమ్మకంతో ఆర్థిక స్వావలంబన సాధించాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. మండలంలోని ముష్టికుంట్ల, బోనకల్‌ల్లో శుక్రవారం పర్యటించిన ఆమె పాడి గేదెలు, షెడ్లు, సోలార్‌ యూనిట్లు, స్వయం సహాయక సంఘాల భవనాలను పరిశీలించి మహిళలతో మాట్లాడారు. గేదెలను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, ఎవరైనా విక్రయించినట్లే తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పశు వైద్యాధికారి అన్వేష్‌, ఏపీఎం కొట్టె వెంకటేశ్వర్లు, సోలార్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement