జూన్‌ కల్లా ‘యంగ్‌ ఇండియా’ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

జూన్‌ కల్లా ‘యంగ్‌ ఇండియా’ స్కూల్‌

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

జూన్‌ కల్లా ‘యంగ్‌ ఇండియా’ స్కూల్‌

ఖమ్మంరూరల్‌/కూసుమంచి: వచ్చే ఏడాది జూన్‌ కల్లా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్‌ మండలం పొన్నెకల్‌లో స్కూల్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌తో కలిసి పరిశీలించాక మంత్రి మాట్లాడారు. పనుల్లో ఎక్కడ ఆలస్యం జరగకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అవసరమైన అదనపు కార్మికులను నియమించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. తొలుత ఏదులాపురం 23వ వార్డులో రూ.2కోట్లతో నిర్మించే గిరిజన భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే, కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., సీపీ సునీల్‌దత్‌తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. పాలేరు పాత కాల్వకు మరోమారు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బీ పీఆర్‌ ఎస్‌ఈలు యుగంధర్‌రావు, వెంకట్‌రెడ్డి, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఈఈలు బుగ్గయ్య, వాణిశ్రీ, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్లు వినయేందర్‌రెడ్డి, సైదులు, ఎంపీడీఓ జశ్వంత్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకబత్తిని అనిత, నాయకులు తోట వీరభద్రం, తేజావత్‌ పంతునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement