గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యాటక అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల్లోనూ పర్యాటక అభివృద్ధి

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● చింతకాని మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మార్చికల్లా నిర్మాణాలు పూర్తి

● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ● చింతకాని మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చింతకాని: గ్రామాల్లోనూ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ రావడమేకాక స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. చింతకాని మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం ఆదివారం కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., సీపీ సునీల్‌దత్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. చింతకానిలోని నల్లచెరువు వద్ద రూ.7.90 కోట్లతో చేపట్టనున్న పర్యాటక వసతుల కల్పన, పందిళ్లపల్లి – అనంతసాగర్‌ మీదుగా చింతకాని జెడ్పీ రోడ్డు వరకు రూ. 4 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, జగన్నాథపురంలో ఖమ్మం–బోనకల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి న్యూ మార్కెట్‌ మీదుగా మత్కేపల్లి– పందిళ్లపల్లి వరకు రూ.4.50 కోట్లతో బీటీ రోడ్డు, నరసింహాపురం ఎస్సీ కాలనీలో రూ.18 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, నాగులవంచ నుంచి రైల్వే కాలనీ ఆర్‌ అండ్‌ బీ రోడ్డు అండర్‌పాస్‌ వరకు రూ. 5 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో వసతులను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పనులు నాణ్యతతో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. సర్పంచ్‌లు వత్సవాయి పద్మ, తాళ్లూరి స్వప్న, కంచం ద్రౌపతి, కిలారు మనోహర్‌బాబు, లోయ ఉపేందర్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు రాయల నాగేశ్వరరావు, నాయడు సత్యం, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, పీఆర్‌, విద్యుత్‌ శాఖ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాసాచారి, యుగంధర్‌రావు, సీసీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బూత్‌ లెవల్‌ ఏజెంట్లే మూలస్తంభాలు

కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్‌ లెవల్‌ ఏజెంట్లే (బీఎల్‌ఏలు) పార్టీకి మూల స్తంభాలని, వారికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. చింతకాని మండలం నాగులవంచలో కాంగ్రెస్‌ బీఎల్‌ఏల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్నతల్లి వంటి పార్టీలో కష్టపడే ప్రతీ కార్యకర్త శ్రమకు తగిన గౌరవం లభిస్తుందన్నారు. పీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు, కాంగ్రెస్‌ జిల్లా, మండల అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్‌, కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. కాగా, చిన్నమండవ గ్రామాభివృద్దికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని సర్పంచ్‌ పర్చా రామచంద్రరావు డిప్యూటీ సీఎంకు వినతిపత్రం అందజేశారు. నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఏనుగు గాంధీ, బెజవాడ రవి, పాల్గొన్నారు. అలాగే, నర్సింహాపురంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు నన్నక లచ్చయ్య కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పరామర్శించారు.

బోనకల్‌: వచ్చే మార్చికల్లా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. బోనకల్‌ మండలం లక్ష్మీపురంలో స్కూల్‌ నిర్మాణ పనులను ఆయన కలెక్టర్‌ దివాకరతో కలిసిపరిశీలించారు. అకడమిక్‌ బ్లాక్‌లు, హాస్టళ్లు, పేరెంట్స్‌ వెయిటింగ్‌ హాల్‌, కిచెన్‌, డైనింగ్‌ హాళ్ల నిర్మాణ పురోగతిపై ఆరా తీసి సూచనలు చేశారు. అవసరమైతే అదనంగా యంత్రాలు, కార్మికులను సమకూర్చుకోవాలని తెలిపారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు బుగ్గయ్య, శ్రీనివా సాచారి, యుగంధర్‌రావు, వెంకటరెడ్డి, శ్రీని వాస్‌ పాల్గొన్నారు. కాగా, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, సీఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌పాషా తదితరులు భట్టిని కలిసి సీఆర్పీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement