ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాధనకు కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్‌బాబా అన్నారు. జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన బాపూజీ జయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఖాదర్‌బాబా మాట్లాడు తూ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించిన బాపూజీ తదితరుల త్యాగాలే ఆ తర్వాత మార్గం చూపాయని తెలిపారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జి.జ్యోతి, నాయకులు చిలకమర్రి శ్రీనివాసబాబు, జల్ల లక్ష్మీనారాయణ, పెండెం జనార్దన్, కమర్తపు గోపాలరావు, బండారు శ్రీను, మల్కా సురేష్, పిల్లలమర్రి కొండలరావు, పులిపాటి సంపత్‌కుమార్, చందా వీరభద్రం, పెందోట సోమేశ్వరాచారి పాల్గొన్నారు.
ఎంజీబీఎస్‌కు మరిన్ని నాన్‌స్టాప్ సర్వీసులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం నాన్‌స్టాప్ ఏసీ సర్వీసుల సంఖ్య పెంచినట్లు ఖమ్మం డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. గతంలో 33 ట్రిప్పులు ఉండగా.. 44కు పెంచామని పేర్కొన్నారు. ఈ సర్వీసుల్లో ఖమ్మం నుంచి ఎంజీబీఎస్‌కు మూడు గంటలే పడుతుందని తెలిపారు. ఖమ్మం నుంచి వెళ్లడం, తిరుగు ప్రయాణంలో ప్రతీ 20 – 30 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని వెల్లడించారు.
నేటి నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఖమ్మంగాంధీచౌక్: వారంలో ఐదు రోజుల పని దినాలు అమలుచేయడమే కాక ఇతర సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సోమవారం నుంచి మూడు రోజుల సమ్మె చేయనున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూని యన్స్(యూఎఫ్‌బీయూ), ఆలిండియా రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఆర్‌ఆర్‌బీఈఏ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు సమ్మె జరగనుంది. ఈమేరకు ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు క్రాంతికుమార్, మక్కడ్ అశోక్, కట్ల కోటయ్య, సంతోష్‌కుమార్, రామకృష్ణ, శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో కోరారు. కాగా, సమ్మె నేపథ్యాన ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఆదివారం బ్యాంకులకు పని దినంగా పాటించారు.
వెల్‌నెస్ సెంటర్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఈహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌లో ఖాళీలను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు డెంటల్ డాక్టర్లు, ఇద్దరు ఫిజి యోథెరపిస్టులతో పాటు ల్యాబ్ టెక్నీషి యన్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయనుండగా, అర్హులు అక్టోబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు లోబడి ఏజెన్సీ ద్వారా తాత్కాలిక విధానంలో నియామకాలు ఉంటాయని తెలిపారు. వివరాలు, దరఖాస్తు ఫారాల కోసం www. gghkhammam.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.


