ఖమ్మంమయూరిసెంటర్: అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నాలుగో జాతీయ మహాసభలు సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మంలో జరగనున్నాయని జాతీయ ఉపాధ్యక్షుడు జే.వీ.చలపతిరావు తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రైతులు, రైతు కూలీలతో భారీ ప్రదర్శన, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. రెండో రోజైన మంగళవారం మహాసభల ప్రారంభ సమావేశం , అనంతరం ప్రతినిధుల సభలు ఉంటాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో సాధించిన ప్రగతిపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు తదితరులు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సభలకు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభలో సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్, ఉపాధ్యక్షులు నిర్భయ్ సింగ్, కార్యదర్శి బాలచందర్ షడంగీ ప్రసంగిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వి.కోటేశ్వరరావు, మండల వెంకన్న, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భిక్షపతి, కార్యవర్గ సభ్యులు బండారు ఐలయ్య, తాళ్లూరి వేణు, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉపాధ్యక్షుడు చలపతిరావు


