రుద్రంపూర్/మణుగూరు టౌన్/సత్తుపల్లి రూరల్: రుద్రంపూర్: రెండు రోజులు కురుస్తున్న వర్షాలతో సింగరేణి కొత్తగూడెం రీజియన్‌లో 22 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొత్తగూ డెం, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని గనుల్లో నీరు నిలవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇక సింగరేణి వ్యాప్తంగా 12ఏరియాల్లో 58వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే, సింగరేణి వ్యాప్తంగా 18ఓసీల్లో రోజుకు 13లక్షల క్యూబిక్ మీట ర్ల ఓవర్ బర్డెన్(ఓబీ) తీయాల్సి ఉండగా, 3 లక్షల క్యూబిక్ మీటర్లకే పరిమితమైంది. కాగా, వర్షం కారణంగా ఓసీల్లోని క్వారీల్లో నిలిచిన నీటిని అధి కారులు ప్లాన్‌టూన్ పంపుల ద్వారా బయటకు తోడిస్తున్నారు.


