కేయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

కేయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

Sep 25 2026 12:23 AM | Updated on Sep 25 2026 12:23 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆది లాబాద్‌ జిల్లాల్లో శుక్రవారం జరగాల్సిన దూరవిద్య డిగ్రీ, పీజీ, రెగ్యులర్‌ లా తదితర పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ తెలిపారు. భారీ వర్షాల హెచ్చరిక ల నేపథ్యాన గురువారం కూడా పరీక్షలు వాయిదా వేశామని పేర్కొన్నారు. మిగిలిన పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం యథావిధిగా జరుగుతాయని, 24, 25 తేదీల పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

విద్యాసంస్థలకు

రెండో శనివారం పనిదినం

ఖమ్మం సహకారనగర్‌: అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యాన గురువారం జిలాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సెలవు ప్రకటించారు. అయితే, పనిదినాల తగ్గొద్దనే ఉద్దేశంతో వచ్చే నెల రెండో శనివారం విద్యాసంస్థలకు పనిదినంగా నిర్ణయించినట్లు కలెక్టర్‌ సూచించారు.

‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తులు

కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వెంకటరమణ సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

చేపల వ్యాధులు,

నివారణపై అవగాహన

వైరా: మంచినీటి చెరువుల్లో పెరిగే చేపలను ఆశించే వ్యాధులు, నివారణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. జాతీయ జలచర జంతువుల వ్యాధుల పర్యవేక్షణా కార్యక్రమంలో భాగంగా వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం రైతులకు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, డాక్టర్‌ పావని, డాక్టర్‌ నాగరాజు, బనోతా దివ్య, చల్లా నరసింహ మాట్లాడారు. చేపలను ఆశించే వ్యాధులు, ప్రారంభదశలో లక్షణాల గుర్తింపు, నివారణను ప్రయోగాత్మకంగా వివరించారు. అక్వాకల్చర్‌ ద్వారా మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉన్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు.

‘ఎస్‌ఐఆర్‌ పేరుతో

ఓట్ల తొలగింపు’

ఖమ్మంమయూరిసెంటర్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) పేరుతో కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల ఓట్లే లక్ష్యంగా తొలగిస్తోందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ ఆరోపించారు. ‘అనుమానాలను స్వీకరించం, ఆ అంశాన్ని కమిషన్‌ పరిశీలిస్తుంది’అని ఈసీ తాజాగా సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌ అసమంజసంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ చేపడుతుంది ఓట్ల తొలగింపు మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు.

రాష్ట్ర స్థాయి పోటీల్లో

‘న్యూవిజన్‌’ విద్యార్థుల ప్రతిభ

ఖమ్మం సహకారనగర్‌: విద్యార్థుల్లో శాసీ్త్రయ ధృక్పథం, సృజనాత్మకతను పెంచడమే లక్ష్యంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ డ్రామా పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించిన న్యూవిజన్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లోని ఈనెల 22న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు ‘ది లాస్ట్‌ క్రై ఆఫ్‌ ది ఓషన్‌’అంశంపై ఇచ్చిన ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించింది. సముద్ర జలాల కాలుష్యం, ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రభావం, పర్యావరణ పరిరక్షణ అంశాలే ఇతివృత్తంగా విద్యార్థులు ఆర్‌.అక్షయశ్రీ, తన్వీర్‌, ఎం.డీ.హిఫ్జా, ఝాన్సీ, సీ.హెచ్‌.విదీ్‌ప్‌, క్షేత్ర, సీ.హెచ్‌.తన్వి, అమ్హర్‌ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు గైడ్‌ టీచర్లు జి.ఉష, డి.సబిత, భవాని, జనార్దన్‌, స్రవంతి, సునీతను న్యూవిజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సీహెచ్‌జీకే.ప్రసాద్‌, డైరెక్టర్‌ కార్తీక్‌తో పాటు ప్రిన్సిపాల్‌ అబాద్‌ అలీ, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement