తిరుమలాయపాలెం: ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలు ఖమ్మంలో ఈనెల 28 నుంచి జరగనున్నాయి. ఈ సభలను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెంలో ఎడ్ల కొటేర్లతో వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నాయకులు మందుల రాజేంద్రప్రసాద్, గొర్రెపాటి వీరస్వామి, అచ్చ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


