ఉత్సాహంగా జిల్లాస్థాయి టీ.టీ. పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జిల్లాస్థాయి టీ.టీ. పోటీలు

Sep 21 2026 12:26 AM | Updated on Sep 21 2026 12:26 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల్లో భాగంగా ఆదివారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో అండర్‌–14, 17 టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు రెండు విభా గాల నుంచి 150 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈమేరకు సాయంత్రం జరిగిన సమావేశంలో విజేతలకు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావు, టీ.టీ.అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వీ.వీ.సాంబమూర్తి, టోర్నీ నిర్వాహకులు చలపతి, మదహర్‌, రామారావు, రాజేష్‌రెడ్డి, సాయిశివ, కత్తుల నవ్య, పర్సా పవన్‌ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల వివరాలను వై.రామారా వు వెల్లడించారు. అండర్‌–14 బాలుర విభాగంలో ఎస్‌.కే.ఫజల్‌, ఈ.హరి, ఏ.ఉజ్వల్‌, జాయ్‌, ఏ.యశ్వంత్‌, కె.హితేష్‌, బాలికల జట్టుకు ప్రవస్య, పి.వంశీక, బి.తన్మయిశ్రీ, బి.హార్విక, బి.ఆరాధ్య, పి.తన్వి ఎంపికయ్యారు. ఇక అండర్‌–17 బాలుర జట్టుకు పి.జ్వలిత్‌, జి.చార్విక్‌, ఇ.తరుణ్‌, కె.అఖిలేష్‌, బాలికల జట్టుకు బి.సాయిశివాని, శరణ్య, పావని, ఏ.శివకుమారి, జి.తీర్థ ఎంపికయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement