ఖమ్మం మయూరిసెంటర్: గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని, యువతను పార్టీతో అనుసంధానం చేయాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ అధ్యక్షతన నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, ఖమ్మం అర్బన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి వెంకటేష్ కూడా మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అంజనీ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్, ఆదర్శ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ శరత్, బిచ్చల అన్వేష్, బాలరాజు పాల్గొన్నారు.
జాతీయ కార్యదర్శి ఖలీద్ అహ్మద్


