కొణిజర్ల: గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలోని కొణిజర్ల మండలం చిన్నగోపతి–పెద్దగోపతి గ్రామాల మధ్య నిర్మించిన అండర్‌పాస్ భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఎత్తు తక్కువగా ఉండడంతో కంటైనర్లు, భారీ లోడ్లతో వచ్చివెళ్లే వాహనాలకు ఆటంకం ఎదురవుతోంది. మండలంలోని పెద్దగోప తి, అనంతారం గ్రామాలతోపాటు చింతకాని మండలానికి చెందిన పలు గ్రామాల వారు ఈ రహదారి మీదుగానే ఖమ్మం మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈక్రమాన శనివారం సాయంత్రం ఓ కంటైనర్ అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయింది. డ్రైవర్ చాకచక్యంగా టైర్లలోగాలి పూర్తిగా తొలగించి వాహనం ఎత్తు తగ్గాక బయటకు వచ్చారు. భారీ వాహనాలకు ఇది ఒక్కటే రహదారి కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.


