జిల్లాకే జలగంనగర్‌ పాఠశాల ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

జిల్లాకే జలగంనగర్‌ పాఠశాల ఆదర్శం

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

ఖమ్మంరూరల్‌: జలగంనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులు సాధించడంతో జిల్లాకే ఆదర్శంగా నిలిచిందని ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోకబత్తిని అనిత అన్నారు. పాఠశాలలో శనివారం కౌన్సిలర్‌ బోయిన కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల అవార్డులు అందుకున్న హెచ్‌ఎం శ్యాంసన్‌తో పాటు ఉపాధ్యాయులను చైర్‌పర్సన్‌ సత్కరించి మాట్లాడారు. విద్యార్థుల సంఖ్యను 400కు చేర్చడమే కాక ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయులు ఆదిలక్ష్మి, రాజిదా బేగం, చీనియ, షాబుద్దీన్‌, ఎస్‌ఎంసీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మితో పాటు బోయిన సాయియాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement